Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 June 2025, 6:55 pm Posted by : ramakrishna

ప్రమాదవశాత్తు ఒకరు మృతి

మోర్తాడ్, బతుకమ్మ: ఏర్గట్ల గ్రామానికి చెందిన పిట్ల మీనా బైక్ మీద నుండి కింద పడి ఆమె తలకు వెనుక భాగంలో రక్త గాయం కావడంతో చనిపోయినట్లు మోర్తాడ్ ఎస్సై విక్రమ్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం ఎర్గట్ల గ్రామానికి చెందిన పిట్ల  మీనా(48), ఆమె  తమ్ముడు బోగా నిత్యనందు మోర్తాడ్ హోండా షైన్ బైక్ నెంబర్ TS16A9343 గల దాని మీద మోర్తాడ్ నుండి ఎర్గట్ల కు వెళ్తుండగా మార్గ మద్యలో తిమ్మాపూర్ గ్రామం శుక్రవారం దేవి గుడి దాటిన తర్వాత డౌన్లో సడన్ గా ఒక కుక్క వచ్చి వారి బైక్ కి తగాలగా వెనుకల కూర్చున్న  పిట్ల మీనా బైక్ మీద నుండి కింద పడగ ఆమెకు తల వెనుక బాగంలో రక్త గాయం అయి చనిపోయినట్లు పేర్కొన్నారు.  మీనా భర్త పిట్ల నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు ప్రారంబించమని  ఎస్సై తెలియజేశారు.