Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 December 2024, 12:51 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రాజంపేట, బతుకమ్మ: రాజంపేట మండలంలోని పొందుర్తి ఎన్ హెచ్ 44పై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందారు. పెట్రోల్ పంప్ నుంచి వస్తున్న ద్విచక్ర వాహనాన్ని స్విఫ్ట్ డిజైర్ ఢీకొనడంతో మహమ్మద్ ఆరిఫ్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. దేవునిపల్లి ఎస్సై రాజు ఘటనాస్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. పొందుర్తి గ్రామస్తులు సోమవారం ఉదయం హైవేపై ధర్నా నిర్వహించారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ రోడ్డు పక్కన దాబా ల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సై రాజు గ్రామస్తుల వద్దకు చేరుకొని దాబాలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు.