Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2024, 4:45 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

బతుకమ్మ భిక్కనూరు: భిక్కనూరు మండలంలోని సిద్ధ రామేశ్వర నగర్ ఎన్ హెచ్44 హైవేపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి చెందగా నలుగురికి గాయాలయ్యాయి. హైదరాబాదు నుండి కామారెడ్డి వైపు వెళ్తున్న కారు ముందు సిద్ధ రామేశ్వర నగర్ గ్రామ శివారుతో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి చనిపోగా కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి ఎస్ఐ సాయికుమార్ చేరుకొని గాయాలు అయిన వారిని 108 లో కామరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయి మృతి చెందిన వ్యక్తిని సిబ్బంది స్థానికుల సహాయంతో ఎస్ఐ బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

One person died in a road accident