మోర్తాడ్, బతుకమ్మ: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయని మోర్తాడ్ ఎస్సై రాము తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మెట్ పల్లి గ్రామానికి చెందిన తాటికొండ పురుషోత్తo (59) మంగళవారం పనిమీద నిర్మల్ వెళ్ళి తిరిగి ఇంటికి స్విఫ్ట్ కార్ నెంబర్ టీఎస్22హెచ్2436 పై ఇంటికి వస్తుండగా మార్గం మద్యలో తహశీల్దార్ ఆఫీసు దగ్గరకి రాగానే ఇట్టి కార్ డ్రైవరు శేకర్ కారును అజాగ్రత్తగా అతివేగంగా నడిపి రోడ్డు పై ఉన్న డివైడర్ కి గుద్ధగా ప్రక్క సీట్ లో కూర్చున్న తాటికొండ పురుషోత్తo తీవ్ర గాయలై చనిపోయాడు అని, డ్రైవరు శేకర్ కి కూడా గాయాలు అయ్యాయి అని తాటికొండ పురుషోత్తo భార్య తాటికొండ కళ్యాణి ఇచ్చిన పిర్యాదు. మేరకు కేసు నమోద్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.