Batukammanews
Newspaper Banner
Date of Publish : 06 September 2025, 7:38 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

మెండోరా, బతుకమ్మ : రోడ్డు ప్రమాదంలో యువకుడు అభినష్(25) మృతి చెందినట్లు బాల్కొండ ఎస్ఐ సుహాసిని తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం సొన్ గ్రామానికి చెందినఅభినాష్ వారి బంధువుల పిల్లలైనా లోకేష్, మానిక్ రావు ముగ్గురు చేపలు పట్టుటకు ఉదయం 11:00 గంటలకు  శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వెళ్లి రాత్రి 11:45 నిమిషాలకు తిరిగి వస్తుండగా ఆర్మూర్ నుండి నిర్మల్ వైపు వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొందని తెలిపారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు ఉండగా  మధ్యలో ఉన్న వ్యక్తికి తలకు, ఇతర చోట్ల బలమైన గాయాలు తగిలి అక్కడికి అక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు. మిగతా ఇద్దరు చికిత్స నిమిత్తం నిర్మల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించినట్లు తెలియజేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.