Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 January 2025, 6:37 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

ఎల్లారెడ్డి, బతుకమ్మ : రోడ్డు  ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం మత్తమాల గ్రామానికి చెందిన రావెల్లి మైసా గౌడ్, అతని భార్య అయిన పద్మ గత నెల 31న మత్తమాల గ్రామం నుండి ఎల్లారెడ్డికి బైక్ పై వస్తున్నారు. మార్గమధ్యలో మత్తమాల గ్రామం సమీపంలో గల సబ్ స్టేషన్ వద్ద రోడ్డుపైకి ఒక్కసారిగా అడవి పందులు వచ్చి మైసగౌడ్, పద్మ ప్రయాణిస్తున్న బైక్ ని ఢీకొట్టాయి. ఈ ప్రమాదంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.  మైస గౌడ్ తలకు బలమైన గాయాలు తగలడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుని అన్న కొడుకు రావెల్లి సాయ గౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.