Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 December 2024, 3:57 pm Posted by : ramakrishna

కరెంట్ షాక్ తో ఒకరు మృతి

బతుకమ్మ,మోర్తాడ్: మోర్తాడ్ మండలంలోని దొంకల్ గ్రామానికి చెందిన సురేష్ అనే వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి ఆదివారం చనిపోయినట్లు మోర్తాడ్ ఎస్సై విక్రమ్ ఒక ప్రకటనలో తెలిపారు. మోర్తాడ్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం డొంకల్ గ్రామానికి చెందిన ఒళ్ళెం సురేష్ తోటలో పని చేసుకుంటుండగా అదే గ్రామానికి చెందిన తీగల పెద్ద మల్లేశ్ ట్రాన్స్ఫార్మర్ ఫ్యూస్ పోయిందని చెప్పి ఫ్యూస్ పెట్టేందుకు సురేష్ ను ట్రాన్స్ఫోర్మర్ దగ్గరకి తీసుకు వెళ్ళగా, సురేష్ ట్రాన్స్ఫార్మర్ ఎక్కి ఫ్యూస్ పెడుతుండగా సురేష్ కి కరెంట్ షాక్ తగిలి కిందపడిపోయి చనిపోయాడు అని సురేష్ భార్య ఒళ్ళెం రాజమని ఇచ్చిన్న ఫిర్యాదు మేరకు కేస్ నమోద్ చేసినట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్త్ చేస్తున్నాం అని మోర్తాడ్ ఎస్సై తెలియజేశారు.