Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 November 2024, 7:25 pm Posted by : ramakrishna

కరెంట్ షాక్ తో ఒకరి మృతి

సదాశివనగర్, బతుకమ్మ : కరెంట్ షాక్ తో ఒకరు మృతి చెందిన ఘటన సదాశివనగర్ మండలంలోని వడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన పట్నం సిద్దిరాములు(49) కూలి పని చేసుకుంటే జీవించే వాడు. రోజూలాగే మంగళవారం వడ్లూర్ ఎల్లారెడ్డి శివారులోని చిట్కూరి కృష్ణారెడ్డి భూముల్లో చెట్లు కొడుతుండగా కరెంట్ షాక్ కు గురయ్యాడు. వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిద్దిరాములును పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. పోసుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.