ప్రమాదవశాత్తు కుంటలో పడి ఒకరి మృతి

నిజాంసాగర్, బతుకమ్మ : ప్రమాదవశాత్తు కుంటో పడి ఒకరు మృతి చెందిన ఘటన బుధవారం నిజాంసాగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిజాంసాగర్ మండలంలోని వడ్డెపల్లికి చెందిన బాలయ్య(58) వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. బుధవారం తన భార్య, కొడుకుతో కలిసి పాపేశ్వరుని కుంట వద్ద గల తన పొలానికి వెళ్లాడు. భార్య, కొడుకును పొలానికి నీరు పారుతుందో లేదో చూడమని చెప్పి తాను పాపేశ్వరుని కుంట వద్దకు వెళ్లాడు. చాలా సేపటి వరకు రాకపోయేసరికి బాలయ్య కుమారుడు రమేష్ పాపేశ్వరుని...