Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 February 2025, 8:49 pm Posted by : ramakrishna

టిప్పర్ ఢీకొని ఒకరు మృతి

తాడ్వాయి, బతుకమ్మ : టిప్పర్ ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన తాడ్వాయి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం మండల కేంద్రానికి చెందిన కీసరి మైసయ్య(55) రోడ్డుపై నడుకుంటూ వెళ్తున్నాడు. అటువైపుగా వస్తున్న టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో మైసయ్యపై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఆయన అక్కడిక్కడీ మృతి చెందాడు. తమకు న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదని బంధువులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పహారా నిర్వహించారు.