కారు ఢీకొని ఒకరి మృతి
బతుకమ్మ, ఏర్గట్ల: మండలకేంద్రం లోఅయ్యప్ప గుడి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమవారం గాండ్ల నాగయ్య(48) మృతి చెందినట్లు ఏఎస్ఐ లక్ష్మణ్ నాయక్ తెలిపారు. పోలీసు కథనం ప్రకారం.. ఏర్గట్ల గ్రామానికి చెందిన గాండ్ల నాగయ్య కూలి పని చే సుకుంటూ జీవిస్తున్నాడు. బట్టపూర్ నుండి తన ద్విచక్ర వాహనంపై ఏర్గట్ల వైపు వస్తుండగా షిఫ్ట్ డిజైర్ కారు ఢీకొని తలకు తీవ్రమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య గాండ్ల జమున ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు...