Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 May 2025, 9:57 pm Posted by : ramakrishna

చెరువులో దూకి ఒకరి ఆత్మహత్య

రామారెడ్డి, బతుకమ్మ : చెరువులో దూకి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన రామారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుందని ఎస్ఐ నవీన్ చంద్ర తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. రామారెడ్డి గ్రామానికి చెందిన లింగాల బాలకృష్ణ గౌడ్ (36) కల్లు దుకాణంలో కూలి పని చేసుకుంటు జీవిస్తున్నాడు. కల్లు దుకాణం నుంచి మధ్యాహ్నం సమయంలో తన మోటార్ సైకిల్ పై బయటకు వెళ్లాడు. గ్రామానికి చెందిన ఒకరు బాలకృష్ణ గౌడ్ భార్యకు ఫోన్ చేసి నీ భర్త పటేల్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపాడు. వెంటనే అక్కడికి వెళ్లి చూడగా చనిపోయి ఉన్నాడు. తన భర్త తాగుడికి బానిసై జీవితంపై విరక్తి చెంది చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపింది. మృతుడి భార్య రజిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ నవీన్ చంద్ర తెలిపారు.

One person committed suicide by jumping into a pond