మహిళా హత్య కేసులో ఒకరి అరెస్ట్

కామారెడ్డి, బతుకమ్మ : లింగంపేటలో మహిళ చిన్నక్క మృతి కేసును పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 4న పెన్షన్ డబ్బుల కోసం వెళ్లిన చిన్నక్క అదృశ్యమయ్యారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసలు నిందితుడి కదలికలను పరిశీలించారు. బాదవత్ ప్రకాశ్ ఆమెను మాయమాటలతో రామయాపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారించారు. అనంతరం ఆమె వద్ద నున్న డబ్బు, మొబైల్ ఫోన్ తీసుకుని...