కామారెడ్డి, బతుకమ్మ : లింగంపేటలో మహిళ చిన్నక్క మృతి కేసును పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో ఛేదించారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర గురువారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ నెల 4న పెన్షన్ డబ్బుల కోసం వెళ్లిన చిన్నక్క అదృశ్యమయ్యారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసలు నిందితుడి కదలికలను పరిశీలించారు. బాదవత్ ప్రకాశ్ ఆమెను మాయమాటలతో రామయాపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు నిర్ధారించారు. అనంతరం ఆమె వద్ద నున్న డబ్బు, మొబైల్ ఫోన్ తీసుకుని పరారయ్యాడు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాసులు, సిఐ రాజారెడ్డి, లింగంపేట్ ఎస్సై దీపక్, సిబ్బంది పాల్గొన్నారు.