Batukammanews
Newspaper Banner
Date of Publish : 18 April 2026, 6:02 pm Posted by : ramakrishna

జీజీ కళాశాల 5వ సెమిస్టర్ పరీక్షల్లో ఒకరు డిబార్

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

గిరిరాజ్ కళాశాల (స్వయం ప్రతిపత్తి) లో 4వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని పరీక్షల నియంత్రణాధికారి భరత్ రాజ్ తెలిపారు. శనివారం నిర్వహించిన పరీక్షకు 874 విద్యార్థులకు 857 మంది విద్యార్థులు హాజరయ్యారని, 17 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. దాంతో పాటు నిర్వహించిన 5వ సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు 109 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఈ పరీక్షలలో ఒక విద్యార్థి మాస్ కాపీయింగ్ కి పాల్పడడంతో అతనిని డిబార్ చేసినట్టు పేర్కొన్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున విద్యార్థులు ఆరోగ్యపరమైన, వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ పి.రామ్ మోహన్ రెడ్డి తెలిపారు.