Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 March 2025, 5:24 pm Posted by : ramakrishna

ఒకే దేశం ఒకే ఎన్నిక  చారిత్రాత్మక నిర్ణయం

  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భారతదేశ అభివృద్ధి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న ప్రాముఖ్యతగల సంస్కరణల్లో మరో చారిత్రాత్మకమైన నిర్ణయం “వన్ నేషన్, వన్ ఎలక్షన్” అని ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. బీజేపీ ఇందూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ వర్క్ షాప్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ఒకే దేశం ఒకే ఎన్నిక అమలయితే దేశానికి కలిగే ప్రయోజనాలను వివరించారు.  సంపద, వ్యయ నియంత్రణ – ప్రతి ఎన్నిక కోసం ఖర్చయ్యే వేల కోట్ల ప్రజా ధనం ఆదా అవుతుందన్నారు.  అభివృద్ధి – తరచూ జరిగే ఎన్నికల వల్ల పాలనా పనులు అంతరాయమవకుండా, ప్రభుత్వం అభివృద్ధిపై పూర్తిగా దృష్టి సారించగలదని తెలిపారు. ఎన్నికల కమిషన్‌పై భారం తగ్గింపు – నిరంతర ఎన్నికల నిర్వహణ భారాన్ని తగ్గించడం ద్వారా సమర్థవంతమైన నిర్వహణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.  వ్యవసాయ & అభివృద్ధి ప్రాజెక్టులకు ఊతం – ఎన్నికల కోడ్ వల్ల అభివృద్ధి పనులు నిలిచిపోకుండా వేగంగా అమలు చేయగలుగుతామన్నారు.  రాజకీయ స్థిరత్వం – అసెంబ్లీ,  పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరగడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ వర్క్ షాప్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారీ, జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి నారాయణ, కార్యకర్తలు పాల్గొన్నారు.

One nation, one election, a historic decision