Batukammanews
Newspaper Banner
Date of Publish : 23 July 2026, 7:47 pm Posted by : ramakrishna

మొక్కల సంరక్షణ బాధ్యత తీసుకోవాలి

 

. . . పంచాయతీ కార్యదర్శి లక్ష్మి దుర్గ

 

మోర్తాడ్, బతుకమ్మ :

 

ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శి లక్ష్మి దుర్గ అన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మోర్తాడ్ మండలంలోని డోన్ పాల్ గ్రామంలో గురువారం ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ, మొక్కలు నాటడం మాత్రమే కాకుండా వాటిని క్రమం తప్పకుండా సంరక్షించడం ద్వారా పచ్చదనాన్ని పెంపొందించవచ్చని తెలిపారు. ప్రతి ఇంటి వద్ద తప్పనిసరిగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామ సర్పంచ్ ముత్యాల భాజమ్మ రాములు మాట్లాడుతూ, ప్రజలందరూ తమ ఇళ్ల పరిసరాల్లో మొక్కలు నాటి వాటిని పెంచాలని కోరారు. పచ్చని వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సాయి ప్రసాద్, ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్, గ్రామ కమిటీ అధ్యక్షులు పరస దేవేందర్, అంగన్వాడీ కార్యకర్త సుజాత, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.