Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 5:31 pm Posted by : ramakrishna

ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడాలి

 

. . . పార్టీ జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడాలని పార్టీ జిల్లా కార్యదర్శి ఏ. రమేష్ బాబు పిలుపునిచ్చారు. శనివారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సీపీఎం పార్టీ కార్యాలయం వద్ద, అలాగే సీఐటీయూ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో జాతీయ జెండాను ఘనంగా ఎగురవేశారు. సీపీఎం పార్టీ కార్యాలయం వద్ద సీనియర్ నాయకులు పెద్ది వెంకట్ రాములు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు విగ్నేష్, సురేష్, నగర నాయకులు అనసూయమ్మ, అనిత, శంషాద్దీన్, అంజయ్య, ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు ఆనంద్, సిర్ప లింగం తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా సీఐటీయూ ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో బార్ధాన్ కార్మికుల సమక్షంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రాములు, ఇమామ్, సురేష్, గంగాధర్, విజయ్, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు. కార్మికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు దేశభక్తి నినాదాలతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

 

One must constantly fight for the people's issues.