Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 June 2025, 2:29 pm Posted by : ramakrishna

టిప్పర్ ఢీకొని ఒకరు మృతి

మాక్లూర్, బతుకమ్మ :  అతివేగంతో వస్తున్న ఇసుక టిప్పర్ ఒకరిప్రాణాలను బలిగొంది. ఈఘటన ముల్లంగి గ్రామశివారులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ముల్లంగి గ్రామానికి చెందిన నడ్పి గంగాధర్ మాదాపూర్ నుంచి తన గ్రామానికి టీవీఎస్ ఎక్సెల్ వాహనం పై వస్తున్నాడు. సబ్ స్టేషన్ సమీపానికి రాగానే ఎదురుగా అతివేగంతో వస్తున్న ఇసుక టిప్పర్ టీవీఎస్ ఎక్సెల్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో గంగాధర్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మాదాపూర్ లోని ఇసుక డంపు నుంచి ఇసుక తరలించడానికి వెళ్లే క్రమంలో డ్రైవర్  అతివేగంగా నడుపుతూ వ్యక్తి ప్రాణాలను బలిగొన్నారు. డ్రైవర్ ను జన్నేపల్లి గ్రామవాసి రాజు గా స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.