ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరి మృతి
నందిపేట్, బతుకమ్మ : ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి చెందిన ఘటన నందిపేట మండ కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. నందిపేటలోని జోర్పూర్ సమీపంలో ఆర్మూర్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు బస్సు ఎదురు గా వస్తున్న బైక్ ని ఢీకొంది. ఈఘటనలో కుద్వాన్ పూర్ వాసి బ్యాగారి పోశెట్టి( 22) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లికి తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తంనిజామాబాదు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.