రైలు ఢీకొని ఒకరి మృతి
భిక్కనూర్, బతుకమ్మ : రైలు ఢీకొని ఒకరు మృతి చెందిన విషాద ఘటన భిక్కనూరు రైల్వే స్టేషన్లో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఉదయాన్నే సంఘటన సమాచారాన్ని తెలుసుకున్న రైల్వే ఎస్సై సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుడు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చి, రైలు కింద తల పెట్టి చనిపోయి ఉంటాడని తెలిపారు. మృతుడి వయసు 35 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందని, మృతుడి దగ్గర ఎలాంటి ఆనవాలు దొరకలేదని పేర్కొన్నారు. రైలు కింద తల పెట్టి చనిపోవడంతో ముఖం గుర్తు...