Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 7:52 pm Posted by : ramakrishna

రైలు ఢీకొని ఒకరి మృతి

 

భిక్కనూర్, బతుకమ్మ :

 

రైలు ఢీకొని ఒకరు మృతి చెందిన విషాద ఘటన భిక్కనూరు రైల్వే స్టేషన్లో మంగళవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. ఉదయాన్నే సంఘటన సమాచారాన్ని తెలుసుకున్న రైల్వే ఎస్సై సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుడు ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చి, రైలు కింద తల పెట్టి చనిపోయి ఉంటాడని తెలిపారు. మృతుడి వయసు 35 నుంచి 45 సంవత్సరాలు ఉంటుందని, మృతుడి దగ్గర ఎలాంటి ఆనవాలు దొరకలేదని పేర్కొన్నారు. రైలు కింద తల పెట్టి చనిపోవడంతో ముఖం గుర్తు పట్టరాకుండా ఉందన్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని కామరెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఎవరైనా మృత దేహాన్ని గుర్తుపట్టినట్లయితే 8712658614 కు సమాచారం అందించాలన్నారు.