Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 April 2025, 1:24 pm Posted by : ramakrishna

ఒకరు డిల్లీనేతల చెప్పులు మోస్తే.. మరొకరు డిల్లీకి బ్యాగులు మోస్తున్నారు

త్వరలో భారీ కుంభకోణాన్ని బయటపెడుతా

మంత్రి పొంగులేటి  బాంబులు తుస్సుమన్నాయ్

మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

వెబ్ న్యూస్, బతుకమ్మ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఒకరు డిల్లీ నేతల చెప్పులు మోస్తే.. మరొకరు డిల్లీకి బ్యాగులు మోస్తున్నారని వ్యాఖ్యనించారు. త్వరలో భారీ కుంభకోణాన్ని బయటపెడతానని ప్రకటించారు. 400 ఎకరాలు కాదు.. దాని వెనుక వేల ఎకరాల వ్యవహారం ఉందని, ఇందులో బీజేపీ ఎంపీ పాత్ర ఉందని ఆరోపించారు.  రెండు పార్టీల జుట్లు డిల్లీ చేతిలో ఉందన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్, బీజేపీలకు ఉమ్మడి సీఎంగా రేవంత్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మంత్రి పొంగులేటి వదులుదామనుకున్న బాంబులు తుస్సుమన్నాయ్. .అందుకే సైలెంట్ అయిపోయాడంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో నెగెటివ్ పాలసీలు పాలిటిక్స్ నడుస్తాయన్నారు. అమెరికా పన్నుల వల్ల తెలంగాణకు భారీ ఎదురు దెబ్బ తగలబోతుందన్నారు. 25 ఏళ్లు పూర్తి చేసుకున్న రెండో తెలుగు ప్రాంతయ పార్టీ బీఆర్ ఎస్ అని, అందుకే వరంగల్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది బీఆర్ ఎస్ చరిత్రలో అతిపెద్ద భారీ బహిరంగ సభ కాబోతుందన్నారు. ఈసారి డిజిటల్ మెంబర్ షిప్ ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. అన్ని జిల్లాల కార్యాలయంలో శిక్షణ తరగతులు నిర్వహించబోతున్నట్లు తెలిపారు.. రాష్ట్రంలో నెలకో కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. వరంగల్ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటామన్నారు.