Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 October 2025, 8:35 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

కమ్మర్ పల్లీ, బతుకమ్మ : కమ్మర్ పల్లీ మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం జరిగిందని కమ్మర్ పల్లి ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం జాతీయ రహదారి 63  పైన మెట్పల్లి కి వెళ్లే రోడ్డులో లలిత ఆశ్రమం దగ్గరలో  రాజేశ్వరరావు పేట్ గ్రామం మెట్పల్లి మండలానికి చెందిన దుంపల సాయికుమార్ తన మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ కారులో  మోర్తాడ్ నుండి  రాజేశ్వరరావు పేట్ గ్రామానికి వెళుతుండగా మెట్పల్లి వైపు నుండి కమ్మర్పల్లి వైపు వస్తున్న కరీంనగర్ 2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ముందు నుండి కారుకు  ఢీకొట్టడంతో కారులో ఉన్న దుంపల సాయికుమార్ కు కుడి చేయికి  గాయాలు అయ్యాయని ప్రమాదంపై  కేసు నమోదు చేసినట్లు కమ్మర్ పల్లి ఎస్సై  పేర్కొన్నారు.