Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 February 2025, 5:32 pm Posted by : ramakrishna

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

ఆర్మూర్, బతుకమ్మ : సైకిల్ ను కారు ఢీకొట్టిన ప్రమాదంలో బుధవారం ఒకరికి తీవ్రంగా గాయాలైనట్లు ఆర్మూర్ ఎస్ హెచ్ ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. దేగాం గ్రామానికి చెందిన గుండపెద్ద గంగారాం(67) తొర్లికొండ వైపు సైకిల్ పై వెళుతున్నాడు. హైదరాబాద్ నుంచి ఆర్మూర్ వైపు వేగంగా  వస్తున్న కారు అతడిని ఢీకొట్టింది. దీంతో గుండ పెద్ద గంగారానికి తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే గాయపడిని వ్యక్తిని నిజామాబాద్ లోని ఆసుపత్రికి  తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.