అర్బన్ నియోజకవర్గానికి వంద కోట్ల నిధులు విడుదల చేయాలి
అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ముఖ్యమంత్రి రేవంత్ కు అంతఃకరణశుద్ధి ఉంటే ఇందూర్ అర్బన్ నియోజకవర్గనికి వంద కోట్ల నిధులు విడుదల చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో పక్షపాతం వహిస్తున్నారంటు మంగళవారం శీతాకాల సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడారు. ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అవుతున్న నియోజకవర్గల అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు కేటాయించకపోవడం సిగ్గు చెటన్నారు....