Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 December 2024, 3:46 pm Posted by : ramakrishna

అర్బన్ నియోజకవర్గానికి వంద కోట్ల నిధులు విడుదల చేయాలి

అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్  సూర్యనారాయణ

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ముఖ్యమంత్రి రేవంత్ కు అంతఃకరణశుద్ధి ఉంటే ఇందూర్ అర్బన్ నియోజకవర్గనికి వంద కోట్ల నిధులు విడుదల చేయాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో పక్షపాతం వహిస్తున్నారంటు మంగళవారం శీతాకాల సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడారు. ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అవుతున్న నియోజకవర్గల అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులు కేటాయించకపోవడం సిగ్గు చెటన్నారు.  వెంటనే సకాలంలో సీడీపీ నిధులు విడుదల చేయాలనీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. స్పెషల్ ఫండ్ కింద నియోజకవర్గనికి 10 కోట్లు ప్రకటిస్తే స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఆ నిధులను పక్కదారి పట్టి దుర్వినియోగం చేసే అవకాశం ఉందన్నారు. ప్రజలు గెలిచిన ఎమ్మెల్యేలను అడుగుతారు కాని ఓడిపోయిన వారికీ కాదని అన్నారు. ముఖ్య మంత్రి రేవంత్ నియోజకవర్గం కొడంగల్ కు 4వేల కోట్లు, కొందరి మంత్రుల నియోజకవర్గలకు వందల కోట్లు పోతుంటే ఇందూర్ అర్బన్ నియోజకవర్గనికి ఒక్క రూపాయి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు. బిజెపి ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఎందుకు ఇంత పక్షపాత వైఖరి అని ప్రభుత్వన్ని నిలదీసారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంతఃకరణ శుద్ధితో పక్షపాతం లేకుండా పరిపాలన చేస్తానని ప్రమాణం చేసి బిజెపి ఎమ్మెల్యేల నియోజకవర్గల పై ఎందుకు పక్షపాతం చూపెడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు.