హత్యాయత్నం కేసులో ఒకరికి ఏడేళ్ల కఠిన జైలు
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఒక వ్వక్తిపై హత్యాయత్నం చేసిన షేక్ అహ్మద్ కు ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ శుక్రవారం తీర్పు వెలువరించారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీ నర్సయ్య తెలిపిన వివరాలు. ఎడపల్లి మండలం నెహ్రు నగర్ గ్రామానికి చెందిన షేక్ అహ్మద్ 12 అక్టోబర్, 2020 న రామ్ నగర్ గ్రామంలోని కల్లు బట్టీలోకి కల్లు తాగడానికి వెళ్ళాడు.కల్లుబట్టిలో కల్లు అమ్ముతున్న పున్నమల్ల రాజేష్ గౌడ్ ను ఉద్దెరకు...