Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 April 2025, 9:42 pm Posted by : ramakrishna

హత్య కేసులో ఒకరికి జీవితఖైదు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : జలీల్ ఖాన్ అనే వ్యక్తిని కట్టేతో కొట్టి చంపిన తంగాల్వాడి నర్సింగ్ అలియాస్ సోను అనే వ్యక్తకి జీవిత కారాగార శిక్ష విధిస్తు నిజామాబాద్ రెండవ అదనపు సెషన్స్ జడ్జి తూముకుంట శ్రీనివాస్ బుధవారం తీర్పు చెప్పారు. నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ నగర్ కాలోనికి చెందిన జలీల్ ఖాన్ ఒక మహిళను బహిరంగ ప్రదేశంలో ప్రతీరోజు భూతు మాటలు తిట్టేడివాడు. దీని వలన  మహిళలకు ఇబ్బంది కలుగుతున్నదని, ముఖ్యంగా రోడ్డు పక్కన రొట్టెలు చేస్తున్న తన పెద్దమ్మ కమల బాయి, మరొక మహిళ కాశక్కలు మహిళలు కనుక చాలా ఇబ్బంది పడుతున్నారని మొరపెట్టుకునేవాడు. బెదిరించే వాడు.కాని ఇతని బెదిరింపులు ఏవి జమీల్ పట్టించుకునేవాడు కాదు.జమీల్ భూతుమాటలు మితిమీరిపోవడం చూసి విసగిపోయిన నర్సింగ్,జమీల్ ను చంపి వేయాలని నిర్ణయించుకుని 14 ఫిబ్రవరి,2024 న రాత్రి ఎనిమిదిన్నర గంటలకు జమీల్ యధావిధిగా భూతు మాటలు మాట్లాడడం చూసి తట్టుకోలేని నర్సింగ్  వెదురు బొంగు కట్టేతో అతని తలపై,ముఖంపై బలంగా కొట్టడడంతో జమీల్ అక్కడికక్కడే మృతిచెందాడనే నేరాభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణలో నిరూపితం అయినట్లు జడ్జి శ్రీనివాస్ ప్రకటిస్తూ ముద్దాయి నర్సింగ్ కు ఇండియన్ పినల్ కోడ్  సెక్షన్ 302 హత్య నేరము కుగాను జీవిత కారాగార శిక్షను ఖరారు చేశారు. నిజామాబాద్ రూరల్ పోలీసుల తరపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బంటు వసంత్ ప్రాసిక్యూషన్ నిర్వహించారు.