నిజామాబాద్, బతుకమ్మ : మద్యం ఉచితంగా ఇవ్వాలని షేక్ షవాలి పై చాకుతో పొడిచి హత్యాయత్నం చేసిన సయ్యద్ షకీల్ కు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి పి. సాయి సుధ సోమవారం తీర్పు చెప్పారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీ నర్సయ్య తెలిపిన వివరాలు…నిజామాబాద్ నగరంలో ని రైల్వే స్టేషన్ చౌరస్తాలో ఎస్ ఎల్ ఎన్ వైన్స్ మద్యం దుకణానికి పర్మిట్ రూమ్ ఉన్నది. అందులో నవీపేట్ మండలం కమలా పూర్ గ్రామ నివాసుడైన షేక్ షవాలి కార్మికునిగా పని చేస్తాడు. ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని బర్కత్ పురకు చెందిన సయ్యద్ షకీల్ రైల్వే స్టేషన్ లో కార్మికునిగా పని చేస్తాడు. రోజు మద్యం సేవించడానికి పర్మిట్ రూమ్ కు వస్తాడు. 18 అక్టోబర్, 2021 న మద్యం తాగడానికి వచ్చాడు. ఉచితంగా మద్యం బాటిల్ ఇవ్వాలని షేక్ శవాలిని డిమాండ్ చేయసాగాడు మద్యం లేదు ఏమిలేదు వెళ్ళమని చెప్పడంతో వెళ్ళిపోయాడు. మల్లి తిరిగి వచ్చి మందు సీసాలు ఉచితంగా ఇవ్వాలని గొడవ చేయసాగాడు, ఇంతకు ముందు కూడా మధ్యం లేదని మనసులో పెట్టుకుని, మధ్యం లేదు అన్నందుకు షేక్ షవాలి ని చాకుతో పొడవడానికి ప్రయత్నం చేయదంతో అతను తప్పించుకునే ప్రయత్నంలో అతని పక్కటెముకలకు బలంగా గాయలయ్యాయి, మరోసారి చాకుతో పొడవటానికి పోవడంతో షేక్ షవాలి ప్రెండ్స్ అడ్డుపడి రక్షించారు. పై నేరారోపణలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు అయినట్లు నిర్దారిస్తూ భారత శిక్షస్కృతి సెక్షన్ 307 హత్యాయత్నం ప్రకారం ఐదు సంవత్సరాల కఠిన కారగారవాసంతో పాటు ఐదు వందల రూపాయల జరిమానా విధించారు.జరిమానా చెల్లించని యెడల అదనంగా నెల రోజుల సాధారణ జైలుశిక్ష అనుభవించాలని జడ్జి సాయి సుధ తమ తీర్పులో పేర్కొన్నారు.