నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి చౌరస్తాలో ఆటో ఢీకొని ఒకరు దుర్మరణం చెందారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఆర్సపల్లి చౌరస్తాలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 50 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వ్యక్తి స్పాట్ లో చనిపోయారు. ఈ మేరకు ఆరవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి డెడ్ బాడీని జిల్లా ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.