రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేనికలను గ్రామానికి చెందిన చెవిటోళ్ల బాలయ్య(59) గురువారం రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందినట్లు కామారెడ్డి టౌన్ పోలీసులు తెలిపారు. కామారెడ్డి లో ఉన్న కోర్టు రోడ్డు నుండి రైల్వే బ్రిడ్జి వైపుకు ఎక్కుతుండగా, అదే సమయంలో నిజాంసాగర్ ఎక్స్ రోడ్ నుంచి స్టేషన్ రోడ్డు వైపు వస్తున్న ఒక క్రేన్ డ్రైవర్ బాలయ్యను ఢీ కొట్టగా తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ తరలించి చికిత్స నిర్వహిస్తుండగా చనిపోయినాడు....