ఎల్లారెడ్డి, బతుకమ్మ : అనారోగ్యంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఒకరు చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు ఎల్లారెడ్డి పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి మండలం అడవి లింగాల గ్రామానికి చెందిన పోలీస్ శ్రీనివాస్ (43) గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.ఏ ఆసుపత్రిలో చూపించిన నయం కాకపోవడంతో తన భార్యతో చెబుతూ ఆరోగ్యం బాగు కావడం లేదు అని బాధపడుతుండేవాడు. ఈనెల 24వ తేదీన నాడు శ్రీనివాస్ భార్య పొలం పనులకు వెళ్లగా ఇంట్లో ఉన్న శ్రీనివాస్ గడ్డి మందు తాగి ఆత్మహత్య కు ప్రయత్నించాడు. పని నుంచి ఇంటికి వచ్చిన శ్రీనివాస్ భార్య గమనించి ఎల్లారెడ్డి ఆసుపత్రికి తరలించింది. అక్కడ నుండి డాక్టర్ సలహా మేరకు కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ శ్రీనివాస్ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు.మృతుని భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.