Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 October 2024, 9:08 pm Posted by : ramakrishna

ప్రమాదవశాత్తు చెరువులో పడి ఒకరి మృతి

నిజామాబాద్ క్రైమ్ బతుకమ్మ : నగర శివారులోని ఆరవ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రు నగర్ లో ఉండే షేక్ ఖయ్యూం బట్టలు ఉతకడానికి వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందిన ఘటన ఆయన కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. ఆరవ టౌన్ పోలీసుల వివరాల ప్రకారం.. ఖయ్యుం రాత్రి అశోక్ సాగర్ ప్రాంతంలో ఇంటి బట్టలు ఉతకడానికి వెళ్లి బట్టలు ఉతికే క్రమంలో ప్రమాదవశాత్తు జారీ చెరువులో పడి మృతి చెందారని పోలీసులు వెల్లడించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి గాలించగా మృతదేహం గురువారం ఉదయం లభ్యమైనట్లు తెలిపారు. వెంటనే మృతదేహాన్నినిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకితరలించినట్లు చెప్పారు.