నాగిరెడ్డిపేట్, బతుకమ్మ : నాగిరెడ్డిపేట మండలం గోపాల్ పేట్ నుండి లొంకలపల్లి వెళ్లే రోడ్డులో మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన రెండు మోటార్‌సైకిళ్లు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో శెట్పల్లి, సంగారెడ్డి జిల్లాకు చెందిన ఒకరు దురదృష్టవశాత్తు మృతి చెందారు. మరో వ్యక్తి, నాగిరెడ్డిపేటకు చెందినవారు, పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ రిఫర్ చేశారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.