రైలు ఢీకొని ఒకరి మృతి

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : ఇందల్వాయి, సిర్నపల్లి రైల్వే స్టేషన్ల మధ్య గుర్తు తెలియని రైలు ఢీకొని ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామానికి చెందిన బద్దం రవీందర్ రెడ్డి(46) మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. గన్నారం గ్రామ శివారులోని రైలు పట్టాల పక్కన గల తన వ్యవసాయ భూమికి వద్దకు వెళుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.