నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాలోని ప్రధానోపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ పై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని ఆర్ బి వి ఆర్ ఆర్ పాఠశాలలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్, ప్రత్యేక అతిథిగా తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజగంగ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈఓ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుల సంఘం ఇంతటి మహత్తర కార్యాన్ని స్వీకరించడం అభినందనీయమని అన్నారు. ప్రధానోపాధ్యాయులు అందరూ సర్వీసు పైన అవగాహన పెంచుకొని పాఠశాలను బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజ గంగారెడ్డి మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయులు విధి నిర్వహణలో కలిగే సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యవర్గం ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సమస్యలను పరిష్కారానికి మార్గం చూపిందని తెలియజేశారు. అంతేకాకుండా ఇటీవల పాఠశాలలో స్కావెంజర్ల నియామకం ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలోనే సాధించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నరేష్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సురేష్, పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, జిల్లా కోశాధికారి దృపత్ కుమార్, డీసీబీ సెక్రెటరీ సీతయ్య, ఎంఈఓ సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.