అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య
కామారెడ్డి క్రైం, బతుకమ్మ : అప్పుల బాధతో కామారెడ్డి పట్టణంలోని కేపీఆర్ కాలనీకి చెందిన కొండా పవన్(42) గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసు కథనం ప్రకారం.. రామారెడ్డి మండలంలోని రెడ్డిపేటకు చెందిన పవన్ కుమార్ రెండేళ్ల క్రితం కామారెడ్డికి వచ్చి స్థిరపడ్డాడు. కామారెడ్డి లో వెల్డింగ్ పని చేసుకునంటూ జీవిస్తున్నాడు. అదే క్రమంలో ఒక ఇల్లు కొని దానిపై బ్యాంకులో రుణం తీసుకున్నాడు. తెలిసిన వారి వద్ద కూడా కొంత నగదు అప్పుగా తీసుకున్నాడు. ఆ బాకీలు చెల్లించలేక మనసులో మదనపడేవాడు....