Batukammanews
Newspaper Banner
Date of Publish : 03 May 2025, 8:27 pm Posted by : ramakrishna

తాగుడుకు బానిసై ఒకరి ఆత్మహత్య

బతుకమ్మ భిక్కనూరు: తాగుడుకు బానిసై  ఉరి వేసుకున్న సంఘటన శనివారం పెద్ద మల్లారెడ్డి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మర్రి ప్రవీణ్ ( 24) తాగుడుకు బానిసై ఇంట్లో ఉరి వేసుకుని చనిపోయాడు. ఎస్సై తెలిపిన సమాచారం ప్రకారం ప్రవీణ్ తాగుడుకు బానిసై ప్రతిరోజు తన తండ్రితో గొడవ పడుతూ ఉండేవాడు తన తండ్రిని తాగడానికి డబ్బులు అడగగా ఇవ్వలేదు మనస్థాపానికి గురైన ప్రవీణ్ ఫ్యాన్ కు తన గదిలో చీరతో ఉరి వేసుకుని చనిపోయాడు తన తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా దావఖానకు తరలించారు.