Batukammanews
Newspaper Banner
Date of Publish : 11 November 2025, 6:17 pm Posted by : ramakrishna

 రైస్ పుల్లింగ్ కేసులో ఒకరి అరెస్టు

 

. . . పరారీలో మరో ఇద్దరు

 నందిపేట్, బతుకమ్మ :

రైస్ పుల్లింగ్ చెంబు ఉందని దాని ద్వార ధన ప్రవాహం కలుగుతుందని రూ.75 లక్షలు మోసం చేసి కాజేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు మరో ఇద్దరు పరారీలో ఉన్నారని నందిపేట్ ఎస్ఐ శ్యాం రాజ్ తెలిపారు. నందిపేట్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నందిపేట్ ఎస్ఐ శ్యామ్ రాజ్ మాట్లాడుతూ…. నందిపేట్ మండలానికి చెందిన ధమ్మన్న గారి సాయి క్రిష్ణ అనే వ్యక్తి తన బావ ఐన హైదరాబాద్ కు చెందిన నర్సింగరావు ద్వారా పరిచయమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లా వాసీ యతిరాజులు రాఘవేంద్ర, యతిరాజులు శ్రీ రామరాజు లు తమ వద్ద రైస్ పుల్లింగ్ చెంబు (అతింద్రియ శక్తులు ఉన్నాయని, మంత్ర శక్తులు ఉన్నాయని ) ఉందని నమ్మించి రూ.75 లక్షలు తీసుకుని మోసం చేశారని పిర్యాదు చేశారు. బాధితుని ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు. మంగళవారం విశ్వసనీయ సమాచారంతో హైద్రబాద్ లోని కుకట్ పల్లి హౌజింగ్ బోర్డులో ఉన్నంటుడంగా అందులో ప్రధాన సూత్రదారి యతిరాజుల రాఘవేంద్ర ను అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ కేసులో ఎ 2 యతిరాజులు శ్రీరాములు, ఎ3 నర్సింగ్ రావు లు పరారీలో ఉన్నారని ఎస్సై తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరిని అరెస్టు చేస్తామని, ప్రజలకు మోసపూరితమైన వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించాలని ఎస్ఐ శ్యాం రాజు సూచించారు.