ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన కేసులో ఒకరి అరెస్టు
ఇందల్వాయి, బతుకమ్మ : మండలంలోని తిర్మన్ పల్లి గ్రామ శివారులో శిలా ఫలకం గద్దెను ధ్వంసం చేసి శిలాఫలకాన్ని దొంగిలించిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఇందల్వాయి పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. తిర్మన్ పల్లి గ్రామ శివారులో ప్రభుత్వం నూతనంగా నిర్మించ తలపెట్టిన 33/11 కేవీ సబ్ స్టేషన్ పనులు జరుగుతున్నాయి. ఈసబ్ స్టేషన్ భూమిలోకి గుర్తు తెలియని వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి శిలాఫలకం గద్దెను ధ్వంసం చేసి శిలాఫలకాన్ని ఎత్తుకె ళ్లారని విద్యుత్ శాఖ ఏఏఈ బొల్లు పాండరినాథ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు....