Batukammanews
Newspaper Banner
Date of Publish : 29 September 2025, 8:21 pm Posted by : ramakrishna

ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఒకరి అరెస్ట్

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తిని పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపిన ఎల్లారెడ్డిపేట ఎస్సై కే.రాహుల్ రెడ్డి. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్, ఓనర్ అయిన ఆలకుంట శివ పై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యూడిషల్ రిమాండ్కు పంపినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఎవరైనా ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేసినట్లయితే వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.