కేరళ సంస్కృతికి ఓనమ్ ప్రతీక

రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి   నిజామాబాద్ రూరల్,  బతుకమ్మ : కేరళ రాష్ట్ర మలయాళీ ప్రజల సంస్కృతి, సంప్రదాయానికి 'ఓనమ్' పండగ ప్రతీకగా నిలుస్తుందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి అన్నారు. డిచ్పల్లి మండలం బర్దీపూర్ శివారులోని తిరుమల నర్సింగ్ అకాడమీలో గురువారం నిర్వహించిన 'ఓనమ్' పండగ కార్యక్రమానికి ఎమ్మెల్యే డా. భూపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. కేరళ రాష్ట్ర యువతీ, యువకులు తమ సంప్రదాయ దుస్తులు ధరించి ఆకర్షణగా నిలిచారు. కేరళ డ్రమ్ వాయిద్యం చాలాసేపు...