రెండో రోజు మహా చండీయాగం

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని దీవి తండా  లో 12వ వార్షికోత్సవంలో భాగంగా  శ్రీ దుర్గాదేవి మాత దేవాలయలో బాబు సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో మహా చండీయాగాన్ని నిర్వహించారు.  ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పాడి పంటలతో,బాగుండాలని ప్రార్థించినట్లు ఆలయ పూజారి శివరాం మహారాజ్ తెలిపారు. బంజారాల ఆరాధ్య దైవంగా దుర్గ దేవి మాతను కొలుస్తామని అన్నారు.ఈ యాగానికి మూడు రాష్ట్రాల నుండి పూజారులు, భక్తులు హాజరయ్యారని తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారులు కందాలై రాజగోపాల...