Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 December 2024, 5:48 pm Posted by : ramakrishna

రెండో రోజు మహా చండీయాగం

ఇందల్వాయి,బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని దీవి తండా  లో 12వ వార్షికోత్సవంలో భాగంగా  శ్రీ దుర్గాదేవి మాత దేవాలయలో బాబు సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో మహా చండీయాగాన్ని నిర్వహించారు.  ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పాడి పంటలతో,బాగుండాలని ప్రార్థించినట్లు ఆలయ పూజారి శివరాం మహారాజ్ తెలిపారు. బంజారాల ఆరాధ్య దైవంగా దుర్గ దేవి మాతను కొలుస్తామని అన్నారు.ఈ యాగానికి మూడు రాష్ట్రాల నుండి పూజారులు, భక్తులు హాజరయ్యారని తెలిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పూజారులు కందాలై రాజగోపాల చారి, కందాల రేఖ నరేష్ కుమార్, బంజారా మండల అధ్యక్షులు తుకారం నాయక్, మాజీ సర్పంచ్ అంబర్ సింగ్, ఇందల్వాయి మాజీ సర్పంచ్ డాక్టర్ సదానంద్, నారా గౌడ్, పండరి,చుట్టుపక్కల గిరిజనులు పాల్గొన్నారు.