ఓ వైపు తయారీ.. మరోవైపు తాగొద్దని అవగాహన

ఉమ్మడి జిల్లాలోయథేచ్ఛగా కృత్రిమ కల్లు తయారీ నార్కోటిక్ శాఖను తప్పుదోవపట్టిస్తున్న జిల్లా అధికార యంత్రాంగం ప్రతి కల్లుబట్టీలో పేదలు సేవిస్తోంది కల్తీ కల్లే.. ఎక్సైజ్, పోలీసులకు ప్రతి సొసైటీ నుంచి మామూళ్లు..?   నిజామాబాద్, బతుకమ్మ: ఉమ్మడి జిల్లాలో రోజుకు లక్షల లీటర్ల కల్తీ కల్లు తయారీ అవుతున్నా పట్టించుకోని సంబంధిత అధికారులు.. ప్రజలకు అవగాహన కల్పించే, వారిని అప్రమత్తం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటుండడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు జిల్లాలో తాటి, ఈత చెట్ల లెక్కే లేకపోగా, సొసైటీలు, లైసెన్సులు, డిపోల నిర్వహణ హడావుడి...