Batukammanews
Newspaper Banner
Date of Publish : 14 April 2025, 3:27 pm Posted by : ramakrishna

బాబా సాహెబ్ 135వ జయంతి సందర్భంగా.. 135 యూనిట్ల రక్త సేకరణ

కామారెడ్డి, బతుకమ్మ: రాజ్యాంగ నిర్మాణ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని తాడ్వాయిలో కామారెడ్డి రక్తదాతల గ్రూప్ సభ్యులు, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్(ఐవీఎఫ్), అంబేడ్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తల సేమియా తో బాధపడుతున్నచిన్నారుల కోసం నిర్వహించిన ఈ శిబిరంలో రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి అంబేడ్కర్ జయంతిని రోజున 135 యూనిట్ల రక్తాన్ని సేకరిచారు. ఈ సందర్భంగా శిబిరం నిర్వాహకులను అదనపు కలెక్టర్ చందర్ నాయక్ అభినందించి దాతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. శిబిరం విజయవంతం చేసేందుకు సహకరించిన డాక్టర్ బాలు, జమీల్ హైమాద్ శివాజీని సన్మానించి పురస్కారాలు అందజేశారు. శిబిరంలో పాల్గొనడంతోపాటు రక్తదానం చేసిన ఎంఈవో రామస్వామి, ఎస్సై వెంకటేశ్వర్లు ఎల్లారెడ్డి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నిజాం, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కపిల్ రెడ్డి ని ప్రత్యేకంగా అభినందించారు.
ఐవీఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాశ్, అధ్యక్షులు జమీల్, ఉపాధ్యక్షులు వెంకటరమణ, ఎర్రం చంద్రశేఖర్, ఎస్సీ సెల్ ఎల్లారెడ్డి నియోజకవర్గ అధ్యక్షుడు గైని శివాజీ, మాజీ సర్పంచ్ సంజీవులు, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్యామ్ రావు, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మద్దెల భాగయ్య, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు కొంగల వెంకటి, వ్యవసాయ మార్కెట్ కమిటీ మండల చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి, సేవాదళ్ సంఘం జిల్లా అధ్యక్షుడు లింగాగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, యూత్ సభ్యులు చిరంజీవి, మహిపాల్, సంతోష్, సంజీవులు, సురేశ్, రవి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నరాల వెంకట్ రెడ్డి, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు లింగం, డీటీఎఫ్ అధ్యక్షుడు ప్రభాకర్, కార్యదర్శి దేవ్లా, అంబేడ్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.


On the occasion of Baba Saheb's 135th birth anniversary.. 135 units of blood collected