మెదక్, బతుకమ్మ: మెదక్ జిల్లాలో మంజీర నది ఉధ్రుతి కాస్త శాంతించింది. ఏడుపాయల ఆలయం ఎదుట స్వల్పంగా వరద కొనసాగుతోంది. 11వ రోజు సైతం ఏడుపాయల దుర్గాభవానీ అమ్మవారి ఆలయం మూసివేసి ఉంది. ఏడుపాయల ఆలయ పరిసరాలు బురద, గడ్డి, నాచుతో నిండిపోయాయి. రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి.
