Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 December 2024, 3:02 pm Posted by : ramakrishna

10న వికలాంగుల మహా ధర్నా జయప్రదం చేయండి

బతుకమ్మ, జుక్కల్:- ఈనెల 10న హైదరాబాదులో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో. నిర్వహించే వికలాంగుల మహాధర్నను జుక్కల్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాల నుండి వికలాంగ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని చేయాలని సిపిఎం పార్టీజిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో వికలాంగులకు 6000 పెన్షన్ ఇస్తామన్న హామీ తో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కార్పొరేషన్ ద్వారా చదువుకున్న వికలాంగులకు ఐదు లక్షల రుణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ప్రైవేటు రంగాలలో  వీరికోట ప్రకారం ఉద్యోగ అవకాశం కల్పించాలని అన్నారు.