. . . సీఎంఆర్ కుంభకోణం లో సీఐడి దూకుడు
. . . మిస్సయినా మిలర్ల కోసం వెతుకులాట
. . . రిమాండ్ లో ఉన్న మిలర్ల ను విచారిస్తున్న సీఐడి
నిజామాబాద్, బతుకమ్మ :
రాష్ట్రo లో వెలుగు చుసిన సన్న వడ్లు తీసుకొని ఎఫ్ సి ఐ కీ దొడ్డు బియ్యం అంటగాట్టిన కుంభకోణం పై సీఐడి దూకుడు పెంచింది. ఈ కేసులో 16 మంది మిలర్ల కు గాను 14 మంది ని అరెస్ట్ చేయగా ఇద్దరు పరార్ అయినా విషయం విధితమే. ఇద్దరు మిల్లర్లు కోర్ట్ ను ఆశ్రయించి బెయిల్ పొందినట్టు తెలిసింది. రిమాండ్ లో ఉన్న 14 మందిని విచారణ కు సీఐడి కస్టడీ పిటిషన్ దాఖలు చేయగా కోర్ట్ అనుమతించింది. మిల్లర్ లను ఇవ్వాళ, రేపు విచారణ చేయనున్నారు. ఇదిలా ఉండగా కొన్ని రైస్ మిల్లు లలో భాగస్వాములు ఇప్పటికి పరారీలో ఉండగా వారి కోసం సీఐడి వేట మొదలు పెట్టింది. వారి కోసం గాలింపు చేపట్టింది.
రాష్ట్రం లో 16 రైస్ మిల్లులు 242 కోట్ల విలువైన బియ్యం విషయంలో ప్రభుత్వంను మోసం చేసినందుకు పౌరసరఫరాల శాఖ జనరల్ మేనేజర్ పిర్యాదు మేరకు నిజామాబాద్, కరీంనగర్, ములుగు, మిర్యాలగూడ కు చెందిన మిల్లర్ లపై సీఐడి కేసులు నమోదు చేసి 14 మంది మిల్లర్ లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అందులో కేవలం నిజామాబాద్ జిల్లా కు చెందిన 6 రైస్ మిల్లు లు ఉన్నాయి. అందులో నలుగురు మిల్లర్ యజమానులు అరెస్ట్ చేయగా వారి పార్టనర్ లు ఎస్కెప్ అయ్యారు. సీఐడి కీ చిక్కకుండ పారి పోయిన వారి కోసం సీఐడి డీఎస్పీ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి గాలిస్తున్నారు. రిమాండ్ లో ఉన్న వారిని విచారిస్తున్నారు. సీఐడి విచారణ లో సన్న వడ్లు తీసుకొని ఏమి చేసారు,వడ్లను అమ్ముకున్నది, ఎలా పక్కదారి పట్టించింది తేలే అవకాశం ఉంది. సన్న వడ్లు తీసుకొని దొడ్డు బియ్యం అప్పగింతలో ఎవరి ప్రయోజనం ఎంత అనే అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది.
